టాటా ఆటోకాంప్ చేతికి ఐఏసీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

టాటా ఆటోకాంప్  చేతికి ఐఏసీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆటో కాంపోనెంట్స్ తయారీదారు టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ గురువారం స్లోవేకియాకు చెందిన ఐఏసీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది. 

లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను బయటపెట్టలేదు. కంపెనీ తన బ్రిటిష్ అనుబంధ సంస్థ ఆర్టిఫెక్స్ ఇంటీరియర్ సిస్టమ్స్ లిమిటెడ్ (ఆర్టిఫెక్స్) ద్వారా ఐఏసీ గ్రూప్ (స్లోవేకియా) 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి షరతులతో కూడిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ వ్యూహాత్మక కొనుగోలు కంపెనీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, యూకే, ఈయూ మార్కెట్లలో విస్తరణకు పునాది వేస్తుందని టాటా ఆటోకాంప్ తెలిపింది.