
న్యూఢిల్లీ: - నాన్–-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ టాటా క్యాపిటల్ నికర లాభం ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్లో రూ.1,040.93 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ. 472.21 కోట్ల లాభాన్ని సాధించింది. త్వరలో ఈ కంపెనీఐపీఓకు రానుంది. తాజా క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 6,557.40 కోట్ల నుంచి రూ. 7,691.65 కోట్లకు పెరిగింది.
ప్రతిపాదిత ఐపీఓలో 47.58 కోట్ల షేర్లు, 21 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, 26.58 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది. ఓఎఫ్ఎస్ కాంపోనెంట్ ద్వారా, టాటా సన్స్ 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) 3.58 కోట్ల షేర్లను అమ్మనుంది.