న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఈవీల ధరలను కూడా 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
మూడు నెలల గ్యాప్‌లో కంపెనీ ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్ 1న కూడా ధరలను పెంచింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాలు, పెరిగిన ముడిసరుకు ఖర్చులే ధరలు పెంచడానికి కారణమని కంపెనీ తెలిపింది.
