సీక్రెట్ సోల్జర్ గా  చైనా పీస్

సీక్రెట్ సోల్జర్ గా  చైనా పీస్

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న  స్పై థ్రిల్లర్  ‘చైనా పీస్’  టైటిల్‌‌ను  ‘సీక్రెట్ సోల్జర్’గా  మార్చారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రానికి తాజాగా  సెన్సార్ నుంచి  యూ/ఏ  సర్టిఫికెట్ లభించింది. 

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను  సెప్టెంబర్‌‌లో  థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని,  రంగస్థలం మహేష్   కీలక పాత్రలు పోషించగా, సంగీతం కార్తీక్ రోడ్రిగ్జ్ అందించాడు.