టీసీఎస్ ఉద్యోగుల జీతాల పెంపు

టీసీఎస్ ఉద్యోగుల జీతాల పెంపు

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు 4.5-7 శాతం వేతన పెంపును ప్రకటించింది.   సోమవారం సాయంత్రం నుంచి ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లెటర్స్ పంపడం ప్రారంభించింది. 

ఈ పెంపు సెప్టెంబరు నుంచి అమలులోకి వస్తుందని సమాచారం. గత రెండు నెలల్లో, టీసీఎస్ ఉద్యోగుల పెంపును వాయిదా వేయడం, 2 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తామని చెప్పడం, ఆ తర్వాత 80 శాతం మందికి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడం వంటివి జరిగాయి.  ఎక్కువగా ఎంట్రీ, మిడిల్​లెవెల్​ ఈ పెంపు వర్తిస్తుంది.