నైజీరియాలో టాటా ఇంటర్నేషనల్​

నైజీరియాలో టాటా ఇంటర్నేషనల్​

హైదరాబాద్​, వెలుగు :  లాగోస్ ఫ్రీ జోన్ (ఎల్​ఎఫ్​జెడ్​)తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా నైజీరియాలో కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నట్టు టాటా ఇంటర్నేషనల్ ప్రకటించింది.  సంస్థ  ఎండీ ఆనంద్ సేన్ సమక్షంలో టాటా ఆఫ్రికా హోల్డింగ్స్ ప్రైవేట్​ లిమిటెడ్, లెన్ బ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.  తమ సంస్థ ఆఫ్రికా ఆర్థిక రంగానికి కీలక సహకారాన్ని అందిస్తోందని సేన్​చెప్పారు.

2006లో టాటా ఇంటర్నేషనల్ నైజీరియాలో కార్యకలాపాలను మొదలుపెట్టింది.  సింగపూర్​కు చెందిన తోలారమ్​గ్రూపు సహకారంతో ఇక్కడ పనిచేస్తామని టాటా తెలిపింది. ఎల్​ఎఫ్​జెడ్​ నైజీరియాలోని మొదటి  ఏకైక ఫ్రీ జోన్. ఇది ఈ ప్రాంతంలోని లోతైన ఓడరేవు లెక్కి పోర్ట్‌‌తో ప్రత్యేకంగా అనుసంధానమై ఉంది.