టాటా సన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా చంద్ర శేఖరన్ మూడోసారి..!

టాటా సన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా చంద్ర శేఖరన్ మూడోసారి..!

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీల పేరెంట్ కంపెనీ టాటా సన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి మరోసారి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  ఎన్. చంద్రశేఖరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (63) ఎన్నికకానున్నారు.  మూడోసారి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తిరిగి నియమించేందుకు ఈ కంపెనీ బోర్డు వచ్చే వారం సమావేశం కానుందని, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం) లో   నియామకంపై నిర్ణయం ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. 

చంద్రశేఖరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రస్తుత పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాది ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం తీసుకోనున్నారు. 65 ఏళ్ల వయసులో తప్పుకోవాల్సి ఉన్నా, 2016లో రతన్ టాటాకు ఇచ్చిన మినహాయింపు మాదిరిగా చంద్రశేఖరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా  ఇవ్వనున్నారు.