800 మందిని తీసేస్తున్న టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌ నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌

800 మందిని తీసేస్తున్న  టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌ నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  తమ కంపెనీకి చెందిన 800 మంది ఉద్యోగులను తీసేస్తామని టాటా స్టీల్ నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. టాటా స్టీల్ యూరప్‌‌‌‌‌‌‌‌ను టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌గా వేరు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగులను తగ్గించుకుంటామని వెల్లడించింది.  నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌లో టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌కు ఏడాదికి 70 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న ప్లాంట్ ఒకటి ఉంది.  ‘స్టీల్ సెక్టార్ ఇబ్బందుల్లో ఉంది. లాభాల్లోకి రావడానికి, ఇతర కంపెనీలతో పోటీ పడడానికి  టాటా స్టీల్‌‌ నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌ వివిధ చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తుంది’ అని టాటా స్టీల్ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, స్టాఫ్‌‌‌‌‌‌‌‌, సపోర్ట్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్న 500 మందిని కంపెనీ తీసేయనుంది. మరో 300 మంది టెంపరరీ వర్కర్లను తొలగించనుంది.