టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, దివంగత రతన్ టాటా సవతి తల్లి అయిన సిమోన్ టాటా(95) అనారోగ్యంతో శుక్రవారం ( డిసెంబర్5) కన్నుమూశారు. రతన్ టాటా ఇనిస్టిట్యూట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన దుబాయ్ నుంచి ఆగస్టులో ఇండియాకు వచ్చిన సిమోన్ టాటా ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం కొలాబాలోని కేథడ్రల్ ఆఫ్ ది హోలీ నేమ్ చర్చిలో సిమోన్ కు అంతిమ సంస్కరాలు నిర్వహించనున్నారు.
కాస్మోటిక్ బ్రాండ్ లాక్మేను స్థాపించి ప్రముఖ కంపెనీగా తీర్చిదిద్దడంలో సిమోన్ టాటా కీలక పాత్ర పోషించారు. స్విట్జర్లాండ్‌లో జన్మించిన సిమోన్.. సర్ రతన్ టాటా ఇన్‌స్టిట్యూట్‌తో సహా అనేక సేవా సంస్థలకు మార్గనిర్దేశం చేస్తూ సేవా కార్యక్రమాలు చేశారు.
►ALSO READ | సీఐఐ గ్లోబల్ సమ్మిట్లో బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూట్కు ప్రైవేట్ గోల్డ్ కేటగిరీలో అవార్డ్
స్విట్జర్లాండ్లోని జెనీవాలో సిమోన్ నావల్ డునోయర్ జన్మించిన ఆమె..1953లో భారత్ కు పర్యాటకురాలిగా వచ్చారు. రెండేళ్ల తర్వాత 1955లో ఆమె నావల్ హెచ్ టాటాను వివాహం చేసుకున్నారు. 1961లో లక్మే బోర్డులో చేరారు. ఆ సమయంలో లక్మే టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ (TOMCO) లో చిన్న అనుబంధ సంస్థ. ఇది హమామ్, ఓకే ,మోడీ సోప్స్ వంటి ప్రసిద్ద సబ్బుల బ్రాండ్లకు ప్రసిద్ధి చెందింది. స్వదేశీ సౌందర్య సాధనాల కోసం భారతీయ మహిళల అవసరాన్ని తీర్చేందుకు బ్రాండెడ్ లాక్మే కంపెనీని సమర్ధవంతంగా ముందుకు నడిపించింది సిమోన్.
