ఇండ్లు కొనేవారికి బడ్జెట్‌‌లో తీపి కబురు?

V6 Velugu Posted on Jan 21, 2022

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు:హోమ్‌‌‌‌ బయ్యర్లకు బడ్జెట్‌‌‌‌లో గుడ్‌‌‌‌ న్యూస్‌‌‌‌ ఉన్నట్టు కనిపిస్తోంది . హోమ్‌‌‌‌ లోన్లపై ట్యాక్స్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను ప్రభుత్వం పెంచొచ్చని సంబంధిత వ్యక్తులు  చెప్పారు.  హోమ్‌‌‌‌ లోన్ల (అసలు) రీపేమెంట్‌‌‌‌కు సంబంధించి యాన్యువల్‌‌‌‌ ట్యాక్స్ డిడక్షన్‌‌‌‌ను ప్రభుత్వం పెంచే ఆలోచనలో ఉందని అన్నారు. ప్రస్తుతం  హోమ్‌‌‌‌ లోన్లను తీర్చడానికి వాడే అమౌంట్‌‌‌‌లో ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు  సెక్షన్‌‌‌‌ 80సీ కింద ట్యాక్స్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను పొందొచ్చు. ఈ లెవెల్‌‌‌‌ను  రూ. 2 లక్షలకు ప్రభుత్వం పెంచొచ్చని అంచనా. ట్యాక్స్ పేయర్లకు రిలీఫ్‌‌‌‌ ఇవ్వడానికి, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ను పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకోనుందని పేర్కొన్నారు. కాగా, సెక్షన్ 80 సీ కింద పబ్లిక్‌‌‌‌ ప్రావిడెంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌, నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌ వంటి  వాటిలో ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ డిడక్షన్‌‌‌‌ను పొందొచ్చన్న విషయం తెలిసిందే. హోమ్‌‌‌‌ లోన్ల (అసలు) రీపేమెంట్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను పెంచి ఎనిమిదేళ్లవుతోందని, మళ్లీ ట్యాక్స్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను పెంచాల్సిన అవసరం ఉందని డెలాయిట్‌‌‌‌ ఇండియా పార్టనర్‌‌‌‌‌‌‌‌ సుధాకర్‌‌‌‌‌‌‌‌ సేతురామన్‌‌‌‌ అన్నారు. కరోనా సంక్షోభం వలన ఖర్చులు పెరిగాయని, ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ కూడా పెరుగుతోందని చెప్పారు.  ఈ టైమ్‌‌‌‌లో ట్యాక్స్ పేయర్లకు రిలీఫ్‌‌‌‌ను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. 

పాత ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌ వైపే ట్యాక్స్ పేయర్లు
కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌లో  ట్యాక్స్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పాత ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌లో  ఇచ్చే డిడక్షన్లను ఈ కొత్త సిస్టమ్‌‌‌‌లో తొలగించారని ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్‌‌‌‌   అకౌంటెంట్స్‌‌‌‌ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్‌‌‌‌ వేద్‌‌‌‌ జైన్ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం  హోమ్‌‌‌‌ లోన్స్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను పెంచాలనుకుంటే సపరేట్‌‌‌‌ క్లాజ్‌‌‌‌తో తీసుకురావాలని సలహాయిచ్చారు. అంతేకాకుండా సెక్షన్‌‌‌‌ 80సీసీడీ కింద నేషనల్ పెన్షన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని అన్నారు.  కిందటేడాది బడ్జెట్‌‌‌‌లో కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సిస్టమ్‌‌‌‌ను ఎంచుకుంది చాలా తక్కువ మంది అని ఎనలిస్టులు అన్నారు. ఎందుకంటే చాలా మంది ట్యాక్స్‌‌‌‌ పేయర్లు ట్యాక్స్ డిడక్షన్లను, మినహాయింపులను క్లయిమ్‌‌‌‌ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. కొత్త ట్యాక్స్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను ట్యాక్స్ పేయర్లు ఎంచుకునేందుకు కొన్ని ప్రోత్సాహకాలను కూడా ఇవ్వొచ్చని చెబుతున్నారు. అంటే బేసిక్ ట్యాక్స్‌‌‌‌ మినహాయింపు లిమిట్‌‌‌‌ను రూ. 2.5 లక్షల నుంచి పెంచొచ్చని అంచనావేస్తున్నారు. పాత సిస్టమ్‌‌‌‌లో కూడా బేసిక్‌‌‌‌ ట్యాక్స్ మినహాయింపు లిమిట్‌‌‌‌ రూ. 2.5 లక్షలు గానే ఉంది. ప్రభుత్వం  ఈ లిమిట్‌‌‌‌ పెంచితే కొత్త ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ పేయర్లను ఆకర్షిస్తుందని  అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌‌‌‌లో మరో ఇన్సెంటివ్‌‌‌‌  కూడా ఉంటుందని రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్ అంచనావేస్తోంది.  అఫోర్డబుల్ హోమ్‌‌‌‌ లోన్లపై అదనంగా రూ. 1.5 లక్షల వడ్డీ డిడక్షన్‌‌‌‌ ఉంటుందని ఈ సెక్టార్ భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ఇన్సెంటివ్‌‌‌‌ను ఇవ్వడాన్ని పొడిగిస్తారని  అంచనావేస్తోంది. 

Tagged budget, business, home loans, Tax payers, tax deduction

Latest Videos

Subscribe Now

More News