ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సాయం

ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సాయం
  • 24x7 బేసిస్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 31 వరకు  అందుబాటులో ఉంటామన్న సంస్థ
  • కాల్స్‌‌‌‌‌‌‌‌, లైవ్‌‌‌‌‌‌‌‌ చాట్స్‌‌‌‌‌‌‌‌, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా వంటి మార్గాల్లో సపోర్ట్‌‌‌‌‌‌‌‌
  • తొందరగా ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫైల్ చేయాలని వెల్లడి

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2022–23 కి గాను ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌లను ఫైల్ చేయడానికి ఈ నెల 31 చివరి తేది. ఈ  నెల 27 నాటికి ఐదు కోట్ల ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఫైల్ అయ్యాయని, కిందటేడాదితో పోలిస్తే మూడు రోజుల ముందుగానే ఈ మార్క్‌‌‌‌‌‌‌‌ను అందుకున్నామని ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించింది. ఫైల్ అయిన 5 కోట్ల ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 4.46 కోట్ల ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే వెరిఫై చేశామని, ఇది 88 శాతానికి సమానమని పేర్కొంది. 2.69 కోట్లకు పైగా ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ కూడా చేశామని తెలిపింది. ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ పేయర్లు  ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ వరకు వెయిట్ చేయొద్దని, వీలున్నంత తొందరగా రిటర్న్‌‌‌‌‌‌‌‌లను ఫైల్ చేయాలని కోరింది. కాల్స్‌‌‌‌‌‌‌‌, లైవ్‌‌‌‌‌‌‌‌ చాట్‌‌‌‌‌‌‌‌, వెబెక్స్‌‌‌‌‌‌‌‌ సెషన్లు, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా  ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి సాయం పొందొచ్చు. ‘ఐటీఆర్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌, ట్యాక్స్ పేమెంట్‌‌‌‌‌‌‌‌లలో సాయం చేయడానికి,  ఇతర రిలేటెడ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందించడానికి మా హెల్ప్‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌ 24x7 బేసిస్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తోంది. కాల్స్‌‌‌‌‌‌‌‌, లైవ్‌‌‌‌‌‌‌‌ చాట్స్‌‌‌‌‌‌‌‌, వెబెక్స్‌‌‌‌‌‌‌‌ సెషన్స్‌‌‌‌‌‌‌‌, సోషల్ మీడియా ద్వారా  సపోర్ట్ అందిస్తున్నాం. శనివారం, ఆదివారంతో సహా ఈ నెల 31 వరకు ఇలానే సపోర్ట్ అందిస్తాం’ అని ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పేర్కొంది. 

సాయం పొందొచ్చు ఇలా..

ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌ లేదా ఫామ్‌‌‌‌‌‌‌‌ల ఈ–ఫైలింగ్‌‌‌‌‌‌‌‌, ఇతర వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు, రీఫండ్‌‌‌‌‌‌‌‌, ఇతర ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్ ప్రాసెసింగ్ రిలేటెడ్‌‌‌‌‌‌‌‌ క్వరీస్‌‌‌‌‌‌‌‌ కోసం  orm@cpc.incometax.gov.in  మెయిల్‌‌‌‌‌‌‌‌కు పాన్‌‌‌‌‌‌‌‌, మీ మొబైల్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  మెయిల్ చేసి తెలుసుకోవచ్చు.  అంతేకాకుండా 1800 103 0025,  1800 419 0025, +91-80-46122000, +91-80-61464700 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి సాయం పొందొచ్చు.  ఈ నెల 27 నుంచి 31 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య ఈ నెంబర్లకు కాల్  చేయొచ్చు.  యాన్యువల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ (ఏఐఎస్‌‌‌‌‌‌‌‌), ట్యాక్స్ పేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్‌‌‌‌‌‌‌‌), స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ) ప్రిలిమినరీ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌, ఈ–క్యాంపెయిన్స్‌‌‌‌‌‌‌‌ లేదా ఈ–వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌పై రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన క్వరీస్‌‌‌‌‌‌‌‌ కోసం 1800 103 4215  నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్  చేయాలి. 

రీఫండ్ రాకపోతే ఇదే కారణం..

మీ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్ కాకపోయి ఉంటే రీఫండ్ క్రెడిట్ కాదు. ఫైల్ చేసిన ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల స్టేటస్‌‌‌‌‌‌‌‌ను చెక్ చేయాలంటే మొదట ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లోకి  వెళ్లి లాగిన్ అవ్వాలి. ఈ–ఫైల్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి  ‘వ్యూ ఈ–ఫైల్డ్‌‌‌‌‌‌‌‌ రిటర్న్‌‌‌‌‌‌‌‌’ ను క్లిక్ చేయాలి. రెండు అంశాల్లో మీ ట్యాక్స్ రీఫండ్ ఆగి ఉండొచ్చు. మొదటిది మీ ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌  ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ అయినా రీఫండ్‌‌‌‌‌‌‌‌కు మీకు అర్హత లేకపోయి ఉండొచ్చు. రెండోది మీ ట్యాక్స్ రిటర్న్ ప్రాసెస్ అయ్యింది. ట్యాక్స్ రీఫండ్‌‌‌‌‌‌‌‌ అర్హత ఉన్నా,    ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ క్లియరింగ్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్ (ఈసీఎస్‌‌‌‌‌‌‌‌) క్రెడిట్ జరగకపోవడం. ఈసీఎస్ క్రెడిట్‌‌‌‌‌‌‌‌కు తప్పు బ్యాంక్ అకౌంట్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడమే కారణం అయి ఉంటుంది.