రూ.5 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్

రూ.5 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్

 

హైదరాబాద్ లోని నాచారంలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ధరావత్ సరోజ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడింది. హైదరాబాద్ సిటీ రేం జ్-2 డీఎస్పీ అచ్చేశ్వర్ రావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు.నాచారం సర్కిల్ 2 లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గా విధుల్లో ఉన్న సరోజ.. మౌలాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి జీఎస్టీ పేరుపై ఉన్న అడ్రస్ మార్చాలని కోరగా అందుకు రూ.5 వేలు డిమాండ్ చేసింది. దీంతో ఆ వ్యాపారి ఏసీబీకి సమాచారం అందించారు. సోమవారం నాంపల్లి గగన్ విహర్ లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సరోజ లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్నారు. నగదును సీజ్ చేసి, సరోజపై కేసు ఫైల్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.