న్యూఢిల్లీ: కిందటి ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి 8.43 కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) లు ఫైల్ కాగా, ఇప్పటి వరకు 8.3 కోట్ల రిటర్న్‌లు వెరిఫై అయ్యాయి. దాదాపు 75 లక్షల రిటర్న్‌లు ఇంకా ప్రాసెస్ కాలేదు. దీంతో అనేక మంది టాక్స్‌పేయర్లు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆలస్యానికి కారణాలు..
అనుమానాస్పద డిడక్షన్లు..
అధిక లేదా అసాధారణ డిడక్షన్ క్లెయిమ్‌లను సిస్టమ్ ప్రాసెస్ చేయడం లేదు. ఆటోమేటిక్‌గా మాన్యువల్ వెరిఫికేషన్‌కి పంపుతోంది. దీంతో రిఫండ్ విడుదలలో ఆలస్యమవుతోంది. అర్హత లేని డిడక్షన్స్ క్లెయిమ్ చేసిన కేసులను అదనంగా రివ్యూ చేయాల్సి ఉంటుంది.
ఏఐఎస్‌ఆదాయంతో సరిపోకపోవడం..
ఆదాయం, టీడీఎస్, వడ్డీ వివరాలు వంటివి ఫామ్ 26ఏఎస్, యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్) తో సరిపోకపోతే రిటర్న్ ప్రాసెస్ కాదని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
రిటర్న్ అప్‌డేట్ చేయకపోతే..
సవరించిన రిటర్న్ ఫైల్ చేయాలంటూ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపొచ్చు. ఈ సవరించిన రిటర్న్ ఫైల్ కానంతవరకు రిఫండ్ రాదు.
బ్యాంక్ అకౌంట్ సమస్యలు..
ప్రీ-వ్యాలిడేషన్ లేకపోవడం, తప్పు అకౌంట్ నంబర్/ఐఎఫ్‌ఎస్‌సీ సబ్మిట్ చేయడం వంటి కారణాలతో రిఫండ్ ఆగొచ్చు. ఐటీఆర్‌లను గడువు తర్వాత కూడా ఫైల్ చేయొచ్చు. రూ.5,000 ఫీజు చెల్లించాలి. ఒక వేళ ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే రూ.వెయ్యి కట్టాలి. అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన 24 నెలల్లో అప్‌డేటెడ్ ఐటీఆర్‌ను ఫైల్ చేయొచ్చు. ట్యాక్స్‌లో 25–50 శాతం వరకు అదనపు పన్ను కట్టాలని సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
