సింగరేణిలో ఆర్థిక దోపిడీకి టీబీజీకేఎస్సే​ కారణం

సింగరేణిలో ఆర్థిక దోపిడీకి టీబీజీకేఎస్సే​ కారణం

మందమర్రి,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని దోచుకుంటోందని, దీనికి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నిర్వాకమే కారణమని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గురువారం మందమర్రి ఏరియా కేకే5 గనిపై నిర్వహించిన గేట్​ మీటింగ్​లో ఆయన  డిప్యూటీ జనరల్​ సెక్రటరీ కె.వీరభద్రయ్యతో కలిసి మాట్లాడారు. సర్కార్​వేల కోట్ల సంస్థ ఫండ్స్​ను తరలించడంతో  సింగరేణికి ప్రమాదం పొంచిఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాస్తున్నాయన్నారు. టీబీజీకేఎస్ లీడర్లు బ్రోకర్లుగా మారి మెడికల్ అన్ ఫిట్ పేరుతో లక్షల్లో దండుకుంటున్నారని పేర్కొన్నారు. సంస్థలో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇంటర్నల్​ఎంప్లాయీస్ తో భర్తీ చేయాలన్నారు. వందేళ్లు దాటిన టీబీజీకేఎస్ వేజ్​బోర్డు సంఘం కాదన్నారు. ఈ సందర్భంగా  కేకే5 గని హెడ్ ఓవర్​మెన్, ఏఐటీయూసీ లీడర్ కొత్త తిరుపతి ఆధ్వర్యంలో100 మంది యువ ఉద్యోగులు ఏఐటీయూసీలో చేరారు.  కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.వీరభధ్రయ్య, బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్ అలీ, దాగం మల్లేశ్, వైస్ ప్రెసిడెంట్లు​భీమనాధుని సుదర్శనం, ఇప్పకాలయ లింగయ్య, లీడర్లు రాజేశం, ప్రసాద్, మల్లయ్య, సమ్మయ్య, కొండయ్య, రాజ్​కుమార్​, సంపత్​, కిరణ్​ తదితరులు పాల్గొన్నారు.