
హోం అప్లయెన్సెస్ కంపెనీ టీసీఎల్..పూర్తి ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల కొత్త ప్రొడక్ట్ లైన్ను విడుదల చేసింది. -వీటిలో ఫ్రంట్ లోడింగ్ ఎఫ్12 సిరీస్ వాషర్ & డ్రయర్ కాంబో, పీ6 సిరీస్ ఫ్రంట్ లోడింగ్ వాషర్లు ఉన్నాయి. వీటిలో బీఎల్డీసీ మోటార్, స్మార్ట్డీడీ మోటార్స్ ఉంటాయి. వీటితోపాటు 7 కిలోల నుంచి 9.5 కిలోల కెపాసిటీ గల ట్విన్ టబ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా పరిచయం చేసింది. వీటిని హైదరాబాద్లోని టీసీఎల్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నామని సంస్థ తెలిపింది.