
దేశంలోని అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు అమెరికా సెనెటర్లు చార్లస్ గ్రాస్‌లీ, రిచర్డ్ డర్బిన్ ఒక అధికారిక లేఖ పంపారు. ఈ లేఖలో టీసీలఎస్ అమెరికాలో ఉద్యోగ నియామకాలపై ప్రశ్నలు లేవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక అమెరికన్ స్టాఫ్‌ను లేఆఫ్ చేస్తూ వేలాది H-1B వీసాల కోసం దరఖాస్తుల్లు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వారు TCS తో పాటు సెనెటర్లు కాగ్నిజెంట్, అమెజాన్, ఆపిల్, డెల్లాయిట్, గూగుల్, జేపీ మోర్గన్, మెటా, వాల్ మార్ట్ మైక్రోసాఫ్ట్ వంది ఇతర పెద్ద కంపెనీలకు కూడా నియామకాలపై ప్రశ్నించారు. H-1B వీసా హోల్డర్లకు, అమెరికన్ ఉద్యోగులకు జీతాలిలో సమానత్వంపై వివరణ కోరారు.
TCS ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12,000 మందికి పైగా ఉద్యోగులను లేఆఫ్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో అమెరికన్ ఉద్యోగులూ ఉన్నారని 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 5505 H-1B వీసా వర్కర్ల నియామకానికి అంగీకారం పొందడం విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. ఇది జాబ్స్ ఆఫ్ అమెరికన్ నేటివ్ ట్యాలెంట్‌ను దూరంగా ఉంచుతూ.. ఉద్యోగాలు స్థానికులకు అందించకుండా విదేశీయులను తీసుకోవడాన్ని సెనెటర్లు గమనించారు.
సెనెటర్లు TCSను అడిగిన 9 ప్రశ్నలు ఇవే:
1. గత కొన్ని సంవత్సరాల్లో అమెరికన్ టెక్ ఉద్యోగులను ఎక్కువ పరిమాణంలో లేఆఫ్ చేసి TCS ఎందుకు విదేశీ టెక్నీషియన్లను ఎక్కువగా నియమిస్తోంది?
2. H-1B వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు, TCS స్థానిక అమెరికన్ ఉద్యోగులను నియమించేందుకు సరైన ప్రయత్నం చేశిందా?
3. H-1B ఉద్యోగుల నియామక ప్రకటనలను సాధారణ నియామకాల ప్రకటనల నుంచి విడగొట్టి తద్వారా గోప్యత ఉంచుతున్నారా?
4. H-1B వీసా ఉద్యోగుల నియామకంతో TCS స్థానిక అమెరికన్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలా?
5. TCSలో H-1B వీసా ఉద్యోగులకు స్థానిక ఉద్యోగుల మాదిరిగా జీతాలు, ప్రయోజనాలు ఇస్తున్నారా? వివరాలతో చెప్పండి.
6. TCSలో స్థాయి ఒక జీతం (level one wages) వద్ద ఎంతమంది H-1B ఉద్యోగులను నియమించింది? ఆ జీతాలతో ఎంతమంది ఇప్పటికీ పని చేస్తున్నారు?
7. TCS ఉద్యోగులను నియమించే కాంట్రాక్టర్లు లేదా స్టాఫింగ్ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారా, అవి H-1B వీసా ఉద్యోగులను కంపెనీ కోసం రిక్రూట్ చేస్తున్నాయా?
8. ప్రస్తుతం TCSలో పనిచేసే H-1B ఉద్యోగుల్లో ఎంతమంది నేరుగా కంపెనీ ఉద్యోగులుగా జీతాలు తీస్తున్నారు?
9. 2025లో TCSకి మంజూరు చేయబడిన H-1B వీసాపై ఎంతమంది ఉద్యోగులు ఇతర సంస్థలకు పంపించబడ్డారు? అలాగే ఎంతమంది జీతాలు ఇతర సంస్థలు చెల్లిస్తున్నాయి?
ఈ ప్రశ్నలకు TCS అక్టోబర్ 10, 2025 నాటికి పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని సెనెటర్లు కోరారు. ఈ లేఖ అమెరికా టెక్ పరిశ్రమలో స్థానిక ఉద్యోగ అవకాశాలను రక్షించాలన్న ఆందోళనల సంకేతాన్ని ఇస్తోంది.