గ్లోబల్ ఏఐ కంపెనీలతో టీసీఎస్, విప్రో, ఇన్ఫీ జట్టు.. జనరేటివ్ ఏఐలో విస్తరించడంపై ఫోకస్‌‌‌‌

గ్లోబల్ ఏఐ కంపెనీలతో టీసీఎస్, విప్రో, ఇన్ఫీ జట్టు.. జనరేటివ్ ఏఐలో విస్తరించడంపై ఫోకస్‌‌‌‌
  • క్లయింట్లకు నచ్చేటట్టు ఏఐ 
  • సొల్యూషన్లను డెవలప్ చేయడమే లక్ష్యం

ఇండియన్ ఐటీ కంపెనీలు టీసీఎస్‌‌‌‌, విప్రో, ఇన్ఫోసిస్‌‌‌‌ జనరేటివ్ ఏఐ రంగంలో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి.  ఇందుకోసం గ్లోబల్ ఏఐ కంపెనీలు ఓపెన్‌‌‌‌ ఏఐ, మైక్రోసాఫ్ట్‌‌‌‌,  ఆంత్రోపిక్‌‌‌‌తో  భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

న్యూఢిల్లీ: ఇప్పటికే సాఫ్ట్‌‌‌‌వేర్ సర్వీసెస్‌‌‌‌లో లీడర్లుగా కొనసాగుతున్న ఇండియన్ ఐటీ కంపెపెనీలు టీసీఎస్‌‌‌‌, విప్రో, ఇన్ఫోసిస్‌‌‌‌..  జనరేటివ్ ఏఐ రంగంలో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి.  ఇందుకోసం గ్లోబల్ ఏఐ కంపెనీలు ఓపెన్‌‌‌‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌‌‌‌,  ఆంత్రోపిక్‌‌‌‌తో  ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  వీటి టెక్నాలజీని  భారత క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేయాలని చూస్తున్నాయి.
 

టీసీఎస్‌‌‌‌ : ఓపెన్‌‌‌‌ఏఐతో టై అప్ అయ్యింది.   ఏఐ -రెడీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్,  ఎంటర్‌‌‌‌ప్రైజ్ సొల్యూషన్స్‌‌‌‌ను  అభివృద్ధి  చేస్తోంది. ఓపెన్ఏఐకి చెందిన చాట్​ జీపీటీ మోడల్స్‌‌‌‌ను బ్యాంకింగ్‌‌‌‌, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌, రిటైల్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లలోని తమ క్లయింట్లకు అనుగుణంగా కస్టమైజ్ చేసి, సొల్యూషన్లు అందిస్తోంది. టీసీఎస్‌‌‌‌ క్లయింట్ల బేస్ పెద్దది. ఓపెన్‌‌‌‌ఏఐకి జనరేటివ్‌‌‌‌ ఏఐలో అనుభవం ఉంది. ఈ రెండు కంపెనీలు కలిసి అడ్వాన్స్​డ్​ ఏఐ సొల్యూషన్లను డెవలప్ చేయడంపై ఫోకస్ పెట్టాయి. గ్లోబల్ ఏఐ సర్వీసెస్ లీడర్‌‌‌‌గా ఎదగడంలో టీసీఎస్‌‌‌‌కు ఈ భాగస్వామ్యం సాయపడుతుందని అంచనా.

విప్రో: మైక్రోసాఫ్ట్‌‌‌‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద 50 వేల కోపైలట్‌‌‌‌  లైసెన్సులను కొనుగోలు చేయనుంది. కంపెనీ ఉద్యోగులు తమ రోజువారి పనుల్లో మైక్రోసాఫ్ట్ కోపైలట్‌‌‌‌ను వాడుకోవడానికి వీలుంటుంది.  వర్డ్‌‌‌‌, ఎక్సెల్‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌పాయింట్, టీమ్స్‌‌‌‌, ఔట్‌‌‌‌లుక్ వంటి మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌‌‌‌లో కోపైలట్‌‌‌‌ ఏఐ అసిస్టెంట్ కలిసి ఉంది. ఇది ఉద్యోగుల రోజువారీ పనులను ఆటోమేట్ చేస్తుంది. ఈ భాగస్వామ్యం వలన విప్రో ఉద్యోగుల ఉత్పాదకత 30-–40శాతం పెరగొచ్చని అంచనా. ఇది క్లయింట్ ప్రాజెక్టులను వేగంగా డెలివర్ చేయడంలో  సహాయపడుతుంది.

ఇన్ఫోసిస్‌‌‌‌:  ఆంత్రోపిక్‌‌‌‌తో భాగస్వామ్యం చేసుకుంది. దీని ద్వారా క్లోడ్‌‌‌‌ ఏఐను తన టోపజ్‌‌‌‌ ఏఐ ప్లాట్‌‌‌‌ఫాంలో ఇంటిగ్రేట్ చేయనుంది.  మొదట టెలికాం రంగంలో ప్రారంభించి, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లోని క్లయింట్లకు మెరుగైన సర్వీస్‌‌‌‌లను అందించాలని కంపెనీ చూస్తోంది.