టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు( బుజ్జి) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.అర్థరాత్రి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటిలోగా ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

2004 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బడేటి బుజ్జి ఏలూరు మున్సిపల్  వైస్ ఛైర్మన్ గా పనిచేశారు. 2009లో ఏలూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన  ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని చేతిలో ఓడిపోయారు. బుజ్జి దివంగత దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు  మేనల్లుడు .