ఎన్నికల వరాలు..భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో

ఎన్నికల వరాలు..భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో

టిడిపి మహానాడులో అధినేత చంద్రబాబు వరాలు కురిపించారు.  భవిష్యత్తుకు గ్యారెంటీ  పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తొలి విడుత టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు వరాలు ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో మహిళల కోసం మహాశక్తి, యువత కోసం యువగళం, రైతుల కోసం అన్నదాత కార్యక్రమం, ఇంటింటికి తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పుర్ టు రిచ్ అనే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

టిడిపి మేనిఫెస్టో..

  • 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో జమ
  •  మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపు
  • తల్లికి వందనం’ పేరుతో ప్రతి బిడ్డా చదువుకునేందుకు ఏటా రూ.15 వేలు ..ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ వర్తింపు
  • స్థానిక సంస్థల్లో పోటీకి పిల్లల నిబంధన ఎత్తివేత.. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు.. ఇకపై ఆ నిబంధన రద్దు 
  •  ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం
  •  యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు
  • యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది
  • రైతులకు ఏటా రూ.20వేలు ఇస్తాం
  • బీసీలకు రక్షణ కోసం చట్టం 
  •  ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌
  • ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలను ధనికులను చేసే కార్యక్రమానికి శ్రీకారం 
  • రూ.2వేల నోట్లు రద్దు చేశారు... రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నా