
విశాఖ: గన్నవరం ఎయిర్ పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్కడి సిబ్బంది తనిఖీలు చేయడంపై విశాఖ టిడిపి ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో తూర్పు , దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్,వెలగపూడి రామకృష్ణ లు అర్ధనగ్నప్రదర్శలతో నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో చంద్రబాబుకి కనీస భద్రత కూడా కల్పించలేదని, ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఏదైన పరిణామం ఎదురైతు ఎవరు భాద్యత వహిస్తారని ప్రశ్నించారు.జగన్ పాదయాత్ర సమయంలో ఎక్కడైనా భద్రత కల్పించకుండా ఉన్న పరిస్ధితులు ఎమైనా ఉన్నాయా అని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకి తగిన భద్రత కల్పించాలని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే జోగు రమేష్ ఏవియేషన్ లో జడ్ ప్లస్ కేటగిరి వర్తించదని, ఈ విషయాన్ని ఏపీడీ అధికారులే స్వయంగా చెప్పారన్నారు. తనిఖీ విషయంపై టీడీపీ నేతలు చేస్తున్న అనవసరమైన హడావుడి మానుకోవాలని అన్నారు.