సెప్టెంబర్ 4న ఇందిరా పార్క్​ వద్ద టీడీపీ ధర్నా

సెప్టెంబర్ 4న ఇందిరా పార్క్​ వద్ద టీడీపీ ధర్నా
  • సెప్టెంబర్ 4న ఇందిరా పార్క్​ వద్ద టీడీపీ ధర్నా
  • తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌‌ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు : ఈ నెల 4న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. దళితులు, గిరిజనులు, బీసీలు, రైతులు, మహిళలు, యువత, పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలపై టీడీపీ శ్రేణులు ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, కో-ఆర్డినేటర్లు,  అనుబంధ సంఘాల అధ్యక్షులు,  తదితరులు పాల్గొన్నారు.