టీచర్ కొట్టడంతో గాయపడ్డ విద్యార్థి

టీచర్ కొట్టడంతో గాయపడ్డ విద్యార్థి

మహబూబ్​నగర్​ జిల్లా సోషల్​వెల్ఫేర్ గురుకులంలో ఘటన 

మరికల్​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా మరికల్​లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి స్టూడెంట్​ను హోంవర్క్​చేయలేదని టీచర్​ కర్రతో కొట్టడంతో గాయపడింది. మండల కేంద్రంలోని గురుకుల స్కూల్​లో స్వాతి 5వ తరగతి చదువుతోంది. ఈనెల 2న ఇంగ్లీష్​ హోంవర్కు చేయకపోవడంతో ఐదుగురిని టీచర్​శైలజ కర్రతో అరచేతులు, మట్టలపై కొట్టింది. స్వాతి చేతులకు వాపు రావడంతో అదే రోజు రాత్రి క్లాస్​టీచర్​తల్లిదండ్రులకు ఫోన్​చేసి మీ బిడ్డకు జ్వరం వచ్చిందని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది.

మరుసటి రోజు తల్లిదండ్రులు రాగా ఇంగ్లిష్​టీచర్​శైలజ కొట్టిందని చెప్పింది. దీంతో ప్రిన్సిపాల్​దగ్గరకు వెళ్లి ప్రశ్నించారు. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. తర్వాత దవాఖానాకు తీసుకువెళ్లారు. మంగళవారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్​ అనురాధ మాట్లాడుతూ తాము  స్కూల్​లో కర్రలు వాడమని, స్టూడెంట్స్​ను కొట్టమని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్​బాబు తెలిపారు.