
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో జరిగిన దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిపై బయాలజీ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పోక్సో యాక్టు కింది కేసు నమోదు చేశారు. అయితే ఆ బయాలజీ టీచర్పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు..పూర్తి వివరాల్లోకి వెళితే..
అమ్మపాలెం మైనార్టీ బాయ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ప్రభాకర్ రావు బయాలజీ టీచర్ గా పనిచేస్తున్నాడు. బాలుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు తిరిగి స్కూళ్ కు వెళ్లేందుకు నిరాకరించడంతో పేరెంట్స్ ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభాకర్ రావుపై కొనిజర్ల పోలీస్ స్టేషన్ లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది.
అయితే పరువుపోతుందని భయంతో ప్రభాకర్ రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రభాకర్ రావు మృతిచెందాడు.