
ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, వెలుగు: రెండో తరగతి చదువుతున్న చిన్నారిపై ఓ టీచర్అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి బంధువులు తెలిపిన ప్రకారం.. ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సాయినందన్ రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా స్కూల్కు వెళ్లమంటే భయపడుతున్నాడు. తల్లిదండ్రులు స్కూల్వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు.
సాయినందన్ నోటికి టేపు చుట్టి, పెన్సిల్తో కండ్లలో కుచ్చుతూ టీచర్వేధించినట్లు కనిపించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. మరోవైపు బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ మేడరన్సిటీ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న రియాన్ఖాన్ను టీచర్ వీపుపై విచక్షణా రహితంగా కొట్టాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.