స్టాక్ మార్కెట్ నష్టాలతో గవర్నమెంట్ టీచర్ సూసైడ్

స్టాక్ మార్కెట్ నష్టాలతో గవర్నమెంట్ టీచర్ సూసైడ్

స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టం కారణంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి తెలిసినవాళ్ల దగ్గర అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. అయితే దేశంలో కరోనా మహమ్మారి విస్తరించడంతో గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్ పడిపోయి శ్రీనివాస్ రెడ్డికి ఆర్థిక నష్టాలు ఎక్కువయ్యాయి. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన, తిప్పర్తి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డి భార్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. సూసైడ్ చేసుకోవడానికి ముందు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. భార్య మరియు పిల్లలు తనను క్షమించాలని లేఖలో కోరాడు.

For More News..

కరోనా కోసం ఆయుష్ టాస్క్‌ఫోర్స్