టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ ఇదే

టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ ఇదే
  • రేపటి నుంచి కొత్త దరఖాస్తులు, ఎడిట్ ఆప్షన్ 
  • తొలిసారిగా ఆన్‌లైన్‌లోప్రమోషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్లు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 3 నుంచి వచ్చే నెల 3 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.  ఈసారి బదిలీలు, ప్రమోషన్లు రెండూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రతిపాదించిన షెడ్యూల్‌‌‌‌ను ఆమోదిస్తూ, శుక్రవారం విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణ మెమో రిలీజ్ చేశారు. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొత్తం 31 రోజులు కొనసాగనుందని తెలిపారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో బదిలీలకు కొత్తగా అప్లై చేసుకొనేందుకు అవకాశం ఇవ్వగా, అవే తేదీల్లో ఇప్పటికే అప్లయ్‌‌‌‌ చేసిన టీచర్లకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. 

స్కూళ్లలో అన్ని కేటగి రీల ఖాళీలతో పాటు ప్రమోషన్లకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్, సీనియారిటీ లిస్టును ప్రకటించనున్నారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరిలో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకోగా,74 వేల మంది అప్లయ్‌‌‌‌ చేసుకున్నారు. తాజాగా మరి కొంతమంది దరఖాస్తు చేసుకోనున్నారు. రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసు కున్న టీచర్లకు, 317 జీవో ద్వారా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయిన టీచర్లకు బదిలీలకు అర్హులుగా తేల్చారు. మ్యూచువల్​లో వచ్చిన టీచర్లకు బదిలీలకు అనుమతి ఇవ్వలేదు. కాగా, యూనియన్ల లీడర్లకు మాత్రమే పది పాయింట్లకు కోత పెట్టగా, మిగిలిన అన్ని అంశాల్లోని పాయింట్లకు యథాతథంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. 

ఇదీ షెడ్యూల్.. 

ఈ నెల3 నుంచి 5 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లయ్‌‌‌‌ 
6,7 తేదీల్లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అప్లికేషన్ కాపీలను డీఈవో కార్యాలయంలో ఇవ్వాలి 
8, 9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి పేర్లను డీఈవో/ఆర్జేడీ వెబ్‌‌‌‌సైట్లలో డిస్‌‌‌‌ప్లే చేస్తారు. ప్రొవిజినల్ సీనియార్టీ లిస్టు రిలీజ్ చేస్తారు. 
10, 11 తేదీల్లో సీనియారిటీ లిస్టులపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ 
12, 13 తేదీల్లో సీనియారిటీ లిస్టు డీఈఓ ఆఫీసుల్లో డిస్‌‌‌‌ప్లే, గ్రేడ్ 2 హెడ్మాస్టర్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు 
14న ఎడిట్‌‌‌‌ ఆప్షన్,15న మల్టీ జోన్ లెవెల్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ బదిలీలు 
16న గ్రేడ్ 2 హెడ్మాస్టర్ల వెకెన్సీ లిస్టు రిలీజ్ 
17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు 
20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ ఖాళీ పోస్టుల డిస్ ప్లే, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 
22న ఎడిట్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌, 23, 24 తేదీల్లో స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్లు 
25న స్కూల్‌‌‌‌ అసిస్టెంట్ పోస్టుల వెకెన్సీ డిస్ ప్లే 
26 నుంచి 28 వరకు ఎస్జీటీలకు ప్రమోషన్లు 
29వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు బదిలీలకు ఎస్జీటీల వెకెన్సీల డిస్ ప్లే, వెబ్ ఆప్షన్ 
అక్టోబర్ 2న ఎడిట్ ఆప్షన్, 3న ఎస్జీటీ, 
దాని సమానమైన కేడర్లకు బదిలీలు