అటు క్లాసులు చెప్పాలె..ఇటు అన్నం కూరలు వండాలె

అటు క్లాసులు చెప్పాలె..ఇటు అన్నం కూరలు వండాలె
  • నాగర్​ కర్నూల్​ జిల్లా జ్యోతిబా పూలే గురుకులంలో ఇదీ పరిస్థితి  

కోడేరు (నాగర్​కర్నూల్) :  గురుకుల పాఠశాలలో వంట మనుషులను మార్చినా కొత్తవారిని నియమించలేదు. దీంతో రెండు రోజులుగా టీచర్లే వంట మనుషులుగా మారాల్సి వచ్చింది. అటు క్లాసులు చెప్తూ...ఇటు టైంకు వంట చేయలేక అవస్థలు పడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కోడేరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకులంలో ఈ పరిస్థితి నెలకొంది. కొన్ని కారణాలతో హాస్టల్​లో వంట చేసే వారిని బంద్​ చేయించారు. కొత్తవారిని తీసుకోకపోవడంతో ఈ భారం టీచర్లు, స్వీపర్లపై పడింది. ఒక్కోసారి టీచర్లకు ఆలస్యమైతే పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. అలాగే బాత్​రూమ్​లకు తలుపులు సరిగ్గా లేవని, హాస్టల్​లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని బాలికలు వాపోతున్నారు. వారం కింద ఓ స్టూడెంట్ ను పాము కరవగా హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​ఇప్పించారని చెబుతున్నారు. ప్రాంగణంలో లైట్లు కూడా లేకపోవడంతో భయం భయంగా గడుపుతున్నామని చెబుతున్నారు.