స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయుల ఆందోళన

 స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయుల ఆందోళన

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో జూనియర్ ఉపాధ్యాయులు ఆందోళనకి దిగారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను 317 జీవోతో స్థానికత పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలను చేపట్టడంతో చాలా మంది జూనియర్ ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 317 జీవో రద్దు చేసి స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.