టీచర్లకు గుడ్‌న్యూస్.. సర్వీసులో చేరిన మొదటి రోజు నుంచే బెనిఫిట్స్

టీచర్లకు గుడ్‌న్యూస్.. సర్వీసులో చేరిన మొదటి రోజు నుంచే బెనిఫిట్స్

హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లలో టీచరుగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన రోజు నుంచి సర్వీసు బెనిఫిట్స్ లెక్కించి ఇవ్వాలని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉద్యోగికి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ చెల్లింపులకు సర్వీసులో చేరిన మొదటి రోజు నుంచే లెక్కలోకి తీసుకోవాలని ఆదేశించింది. పెన్షన్ ఖరారుకూ ఇది వర్తిస్తుందని హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్ తీర్పిచ్చారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ బాలికల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైరైన సుమిత్ర, ఇతరులు వేసిన కేసులో శనివారం ఈ తీర్పు వెలువరించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టులో 1959-65 పీరియడ్‌లో ఉద్యోగంలో చేరిన తమకు.. 10,15, 20 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్, పెన్షన్ బెనిఫిట్స్ పొందడానికి అధికారులు అనుమతించట్లేదని ఆరోపించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ నుంచి తమ స్కూలును ప్రభుత్వం తొలగించడంతో సర్వీస్ రూల్స్ తమకు వర్తించదని మేనేజ్ మెంట్ వాదించింది.