సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినం

సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినం
  • బదిలీలు, ప్రమోషన్ల కోసమేనని యూఎస్పీసీ వెల్లడి

హైదరాబాద్ : దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. దీనికోసం వచ్చే నెల 4న జిల్లా కేంద్రాల్లో టీచర్ల సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని తెలిపింది. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్​ ధర్నాచౌక్​లో సెప్టెంబర్ 11 నుంచి బదిలీల షెడ్యూల్ ఇచ్చేదాకా రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

తమ డిమాండ్లపై దశలవారీ ఆందోళaనలు చేయాలని ఆదివారం హైదరాబాద్​లో జరిగిన యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. విద్యారంగ సమస్యలపై సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని నేతలు డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినాన్ని నిర్వహిస్తామని, ఈ సందర్భంగా టీచర్లంతా నల్లబ్యాడ్జీలతో అటెండ్ కావాలని యూఎస్​పీసీ నేతలు కోరారు.