ఆగస్టు 23న టీచర్ల మహాధర్నా..పోస్టర్ రిలీజ్ చేసిన యూఎస్పీసీ నేతలు 

ఆగస్టు 23న టీచర్ల మహాధర్నా..పోస్టర్ రిలీజ్ చేసిన యూఎస్పీసీ నేతలు 

హైదరాబాద్, వెలుగు: విద్యారంగ, టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న హైదరాబాద్​లో మహాధర్నా  నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్​పీసీ) ప్రకటించింది. హైదరాబాద్​లోని టీఎస్ యూటీఎఫ్​ స్టేట్ ఆఫీసులో యూపీఎస్​సీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం శనివారం ఇందిరాపార్క్​వద్ద జరిగే మహాధర్నా పోస్టర్లను రిలీజ్ చేశారు.

స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, తిరుపతి, లింగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 20  నెలలు గడిచినా టీచర్ల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ప్రతి జిల్లాకు డీఈఓ పోస్టు, రెవెన్యూ డివిజన్​కు డిప్యూటీఈఓ, మండలానికో ఎంఈఓ పోస్టును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లు, పింఛనర్ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని కోరారు.