టీచర్ల ప్రమోషన్, ట్రాన్స్ఫర్ల షెడ్యూల్ రిలీజ్

టీచర్ల ప్రమోషన్, ట్రాన్స్ఫర్ల షెడ్యూల్ రిలీజ్

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ షురూ చేయనున్నట్లు ప్రకటించింది. 27న కేటగిరీల వారీగా వేకెన్సీ లిస్టు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ లిస్టు విడుదల చేయనున్నారు. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు ట్రాన్స్ ఫర్లకు సంబంధించి ఆన్ లైన్ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను 37 రోజుల్లో పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 4నాటికి ప్రాసెస్ పూర్తి చేయనుంది. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లను స్వీకరించి 15 రోజుల్లో వాటిని పరిష్కరించనున్నారు.