పోస్టల్​ బ్యాలెట్​ ఇవ్వలేదంటూ .. డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​ వద్ద టీచర్ల నిరసన

పోస్టల్​ బ్యాలెట్​ ఇవ్వలేదంటూ .. డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​ వద్ద టీచర్ల నిరసన
  • వేములవాడ జూనియర్ ​కాలేజీలో ఆందోళన

వేములవాడ, వెలుగు : అందరికీ ఓటు వేయాలని చెప్పే తమనే ఆ హక్కుకు దూరం చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీచర్లు నిరసన తెలిపారు. బుధవారం జూనియర్​ కాలేజీ గ్రౌండ్​లో ఎలక్షన్​ సామగ్రి డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​ కు డ్యూటీ కోసం వచ్చిన టీచర్లు తమకు బ్యాలెట్ ఓటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇంతవరకు తమకు పోస్టల్​బ్యాలెట్​ రాలేదన్నారు. ఓటు హక్కు కల్పించకపోవడంపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు.

నాలుగు రోజులుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా  స్పందించలేదన్నారు. డ్యూటీ సక్రమంగా చేయకపోతే అధికారులు చర్యలు తీసుకుంటారని, ఘటనకు బాధ్యలుపై ఎవరు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తమకు పోస్టల్​బ్యాలెట్​  హక్కు కల్పించాలని డిమాండ్​ చేశారు.