ఒక క్లాస్‌ రూమ్‌లో ఒకేసారి రెండు తరగతులకు పాఠాలు..ఇదెక్కడో తెలుసా..?

ఒక క్లాస్‌ రూమ్‌లో ఒకేసారి రెండు తరగతులకు పాఠాలు..ఇదెక్కడో తెలుసా..?

న దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూపించే సంఘటన ఇది. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లోని స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులని అంటారు. మరీ నేటి పిల్లలకు సరైన క్లాస్ రూమ్ లు, చదువులు లేకపోతే వారి పరిస్థితి ఏంటి..? బీహార్ రాష్ట్రంలోని ఓ స్కూల్లో ఒకే క్లాస్ రూమ్ లో రెండు తరగతుల విద్యార్థులకు క్లాసులు చెప్పారు టీచర్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మధ్య బీహార్‌ రాష్ట్రంలో స్కూళ్లను విలీనం చేశారు. ఇలా విలీనం చేసిన స్కూళ్లలో విద్యార్థులు పెరిగిపోయారు. కానీ, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు తరగతి గదులు లేవు. దీంతో కతిహార్‌లోని ఆదర్శ్ మిడిల్ స్కూల్ లో రెండు తరగతుల విద్యార్థుల్ని ఒకే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టారు. ఒకే బ్లాక్ బోర్డును ఇద్దరు టీచర్లు సగం సగం పంచుకున్నారు. ఓ వైపు ఉర్దూ టీచర్, మరోవైపు హిందీ టీచర్ పాఠాలు చెప్పడం ప్రారంభించారు. మరోవైపు స్టూడెంట్స్ అల్లరి చేస్తుండగా.. వారిని అదుపు చేయడానికి మరో సీనియర్ టీచర్ బెత్తం పట్టుకుని సైలెన్స్ అని అరుస్తున్నారు. 

అయితే..విద్యాశాఖ అధికారులు మాత్రం ఆదర్శ్ మిడిల్ స్కూల్లో విద్యార్థులు తక్కువగా ఉంటారని, అందుకే రెండు క్లాసులకు రెండు తరగతి గతులు అడ్జస్ట్ చేయడం సాధ్యం కాలేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను భావి భారత పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

షాకిస్తున్న టమాట.. కొండెక్కిన కోడి

కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలె