టీచర్లు పాఠాలు చెప్పడానికే పరిమితం కావద్దు : డా. చుక్కా రామయ్య

టీచర్లు పాఠాలు చెప్పడానికే పరిమితం కావద్దు : డా. చుక్కా రామయ్య

టీచర్లు పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా.. దేశం గురించి విద్యార్థులను ఆలోచింపజేసే ప్రయత్నాలు చేయాలని డా. చుక్కా రామయ్య అన్నారు. ఓయూ దూర విద్యాకేంద్రంలో చుక్కా రామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా.చుక్కా రామయ్య 98వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 80 ఏళ్లకుపైగా ప్రజా ఉద్యమ ప్రస్థానం ఉన్న చుక్కా రామయ్యపై విద్యా గోష్ఠి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు పలువురు ప్రొఫెసర్లు  పాల్గొన్నారు. చిన్ననాటి గురువు నమ్మాళ్ వార్ స్వామి తనకు స్ఫూర్తిప్రదాత అని డా.చుక్కా రామయ్య అన్నారు. దేశానికి ఇంకా ఏదో చేయాలన్న స్ఫూర్తినిచ్చేలా ఈ  విద్యా గోష్ఠి కార్యక్రమం ఉందన్నారు. తానెక్కడున్నా ప్రజల మనిషిగానే ఉంటానని స్పష్టం చేశారు.