టీ20ల్లో 300 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ

టీ20ల్లో 300 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ

టీమిండియా సారథి రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.  ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీ20లో అత్యధిక ఫోర్లు బాదిన రెండో ప్లేయర్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టీ20లో 300 ఫోర్లు బాదిన మొదటి భారత ప్లేయర్ రోహిత్ శర్మనే కావడం విశేషం. 

ఒకే ఒక్కడు..
2007 నుంచి టీ20లు ఆడుతున్న రోహిత శర్మ.. 126 టీ20 మ్యాచ్‌లాడి 298 ఫోర్లు కొట్టాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టీ20లో మూడు ఫోర్లు బాదడంతో... టీ20ల్లో 300 ఫోర్లు నమోదు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఇంటర్నేషనల్  టీ20ల్లో అత్యధిక బౌండరీలు బాదిన క్రికెటర్‌గా ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 325 ఫోర్లతో టాప్‌ ప్లేస్లో ఉన్నాడు. అతను 104 టీ20ల్లో 325 ఫోర్లు కొట్టాడు.  అత్యధిక ఫోర్లు కొట్టిన మొదటి భారత ప్లేయర్గా రోహిత్ శర్మ ఉండగా..ఆ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.  అతను 298 బౌండరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.