రోహిత్ శర్మ వరస్ట్ రికార్డు

రోహిత్ శర్మ వరస్ట్ రికార్డు

మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు 49 పరుగుల తేడాతో ఓడింది. 228పరుగుల ఛేజింగ్‌లో  బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ..పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. రబాడా బౌలింగ్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  దీంతో తన కెరీర్లో అతి చెత్త రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశాడు. 

వరస్ట్ రికార్డు
టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయిన ప్లేయర్‌గా రోహిత్ చరిత్ర నెలకొల్పాడు.టీ20ల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 43వ సార్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యాడు. గతంలో ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్‌ పేరిట ఉండేది. అతను 42 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యాడు. కెవిన్ ఓ బ్రియన్ తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ 40 సార్లు సింగిల్ డిజిట్కే పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత 39 సార్లు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు - మొహమ్మద్ నబీ, 37 సార్లు పాక్ క్రికెటర్- షాహిద్ అఫ్రిది సింగిల్ డిజిట్ చేశాడు. 

రోసోవ్ సెంచరీ..
ఇండోర్‌లో జరిగిన చివరి టీ20లో సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 3 వికెట్లకు 227 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది.తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా రెండు సార్లు డకౌట్‌ అయిన రోసోవ్ మూడో మ్యాచ్‌లో మాత్రం సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోసోవ్ ..మరో 21 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.