
- ఒకే ఏడాది అన్నదమ్ముల పెళ్లి..
- గత ఐపీఎల్ లో ప్రపోజ్..ఈ ఐపీఎల్ లో మ్యారేజ్..
మరో ఐపీఎల్ క్రికెటర్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ప్రేమించిన యువతిని పెళ్లాడబోతున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్..త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి జయా భరద్వాజ్ ను దీపక్..జూన్ 1న వివాహం చేసుకోనున్నాడు. ఈ విషయాన్ని దీపక్ చాహర్ తండ్రిలోకేందర్ సింగ్ వెల్లడించాడు. ఈ ఇద్దరు పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపాడు.
గత ఐపీఎల్ లో ప్రపోజ్..ఈ ఐపీఎల్ లో మ్యారేజ్..
దీపక్ చాహర్, జయా భరద్వాజ్ మంచి స్నేహితులు. దీపక్ సోదరి మాల్తీ వల్ల జయా భరద్వాజ్ దీపక్ కు పరిచమైంది. ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా జయను గాఢంగా ప్రేమిస్తున్న దీపక్..లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో అందరి ముందే ప్రపోజ్ చేశాడు. పంజాబ్ తో ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత చాహర్.. జయాకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఏడాది తిరిగే సరికి ఇద్దరు ఏడడుగులు వేయనున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన శుభలేక ప్రస్తుతం వైరల్ గా మారింది.
జయా భరద్వాజ్ ఎవరు...
జయా భరద్వాజ్ స్వస్థలం ఢిల్లీ. ఎంబీఏ చేసిన జయా..ఓ టెలికాం కంపెనీలో డిజిటల్ ఫ్టాట్ ఫారం హెడ్ గా పనిచేస్తుంది. జయా భరద్వాజ్ తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి హోర్డింగ్ డిజైన్ వ్యాపారం చేపట్టి ఆమెను పెంచింది. జయ సోదరుడు బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్. అతను బిగ్ బాస్-5లో ద్వారా మరింత గుర్తింపు పొందాడు.
మార్చిలో తమ్మడి పెళ్లి..జూన్ లో అన్న పెళ్లి..
దీపక్ చాహర్ సోదరుడు రాహుల్ చాహర్ ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. తన మార్చి 9న తన గర్ల్ ఫ్రెండ్ ఇషానీను వివాహమాడాడు. గోవాలోని ఓ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో ఈ వేడుక జరిగింది. క్రికెటర్లు, బంధువులు, ఇతర ఆహ్వానిధులు అందరూ ఈ పెళ్లికి హాజరై వధూ వరులను అశీర్వదించారు. తాజాగా ఇప్పుడు దీపక్ చాహర్..ఇంటివాడు కాబోతున్నాడు.
దీపక్ చాహర్ ఏం చేస్తున్నాడు...
వెన్ను నొప్పి కారణంగా ఐపీఎల్ 2022కు దూరమైన దీపక్ చాహర్..ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. జూన్ 1న పెళ్లి ఉండటంతో వెన్ను నొప్పి తగ్గినా..అతను రెండు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో టీ-20 వరల్డ్ కప్ ఉండటంతో ఆ లోగా జట్టులోకి రావాలని భావిస్తున్నాడు.