నిలకడగా ఆడుతున్న టీమిండియా

నిలకడగా ఆడుతున్న టీమిండియా

బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలిరోజు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసిన భారత జట్టు..రెండో రోజు ఆటను మొదలు పెట్టిన కాసేపటికే వికెట్ కోల్పోయింది. ఫస్ట్ డే పూజారాతో కలిసి భారత్ను ఆదుకున్న శ్రేయస్ అయ్యర్..రెండో రోజు..హొస్సేన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 86 పరుగులు చేసిన శ్రేయస్ 7వ వికెట్గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత అశ్విన్, కుల్దీప్ కలిసి టీమిండియా స్కోరు బోర్డును నడిపించారు. ఈ ఇద్దరు బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 8వ వికెట్ కు 54 పరుగులకు పైగా జోడించారు. లంచ్ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. క్రీజులో 40 పరుగులతో అశ్విన్, 21 పరుగులతో కుల్దీప్ ఉన్నారు.