తొలి వన్డేలో ధావన్ అరుదైన ఘనత

 తొలి వన్డేలో ధావన్ అరుదైన ఘనత

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు శిఖరధావన్, శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించారు. ఆక్లాండ్లో తొలిసారిగా 100 పరుగుల ఓపెనింగ్ పాట్నర్ షిప్ను నమోదు చేసిన జోడిగా రికార్డు నెలకొల్పారు.  తొలి వికెట్కు ధావన్-- గిల్ జోడి..23.1 ఓవర్లలో 124 భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో గతంలో ఉన్న 70 పరుగుల భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టారు. 2003లో అప్పటి టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ తొలి వికెట్కు 70 రన్స్ జోడించారు. ప్రస్తుతం ఆ రికార్డు బద్దలైంది. 

ధావన్ రికార్డు..

తొలి వన్డేలో హాఫ్ సెంచరీ సాధించడం వల్ల టీమిండియా కెప్టెన్ ధావన్ రికార్డు క్రియేట్ చేశాడు. 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిస్ట్ A క్రికెట్లో 12 వేల పరుగుల మార్కును దాటిన ఏడో బ్యాట్స్మన్గా ధావన్ నిలిచాడు. ధావన్ ఇప్పటి వరకు 297 మ్యాచుల్లో 12,025 పరుగులు సాధించాడు. ఇందులో 167 వన్డేలు ఉన్నాయి. ఇక ధావన్ కంటే ముందు సచిన్ 21,999 రన్స్తో మొదటి స్థానంలో ఉండగా...గంగూలీ 15,622 పరుగులతో  రెండో స్థానంలో, ద్రవిడ్ 15,271 పరుగులతో మూడో స్థానంలో.. ధోనీ (13,353), యువరాజ్ సింగ్ (12,633) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు