కేఎల్ రాహుల్, సూర్య హాఫ్ సెంచరీలు, టీమిండియా భారీ స్కోరు

కేఎల్ రాహుల్, సూర్య హాఫ్ సెంచరీలు, టీమిండియా భారీ స్కోరు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మన్ దుమ్ము రేపారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన...20 ఓవర్లలో 7 వికెట్లకు 186  పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులే చేసి ఔటైనా..మరో ఓపెనర్ కేఎల్ రాహుల్..హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 33 బంతుల్లోనే 3 సిక్సులు, 6 ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. రోహిత్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 19 పరుగులతో పర్వాలేదనింపించాడు. అయితే భారీ స్కోరు మాత్రం సాధించలేక..స్టార్క్ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. అనంతరం వచ్చిన పాండ్యా, దినేష్ కార్తీక్..ఇలా వచ్చి అలా వెళ్లారు. 

రెచ్చిపోయిన సూర్యకుమార్..
ఓ వైపు వికెట్లు పడుతున్నా....సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..భారత్ కు భారీ స్కోరును అందించాడు. ఇదే క్రమంలో 33 బంతుల్లో ఒక సిక్సు, 6 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.  ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా...స్టార్క్, మాక్స్ వెల్, ఆష్టన్ అగర్ తలో ఓ వికెట్ దక్కించుకున్నారు.