షమీ సర్జరీ సక్సెస్‌‌‌‌

షమీ సర్జరీ సక్సెస్‌‌‌‌

న్యూఢిల్లీ : టీమిండియా స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ షమీ ఎడమ చీలమండకు జరిగిన సర్జరీ సక్సెస్‌‌‌‌ అయ్యింది. సోమవారం లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు. షమీ కోలుకోవడానికి మూడు నెలల టైమ్‌‌‌‌ పట్టనుంది. దాంతో ఈ ఐపీఎల్‌‌‌‌కు అతను దూరం కానున్నాడు. అయితే జూన్‌‌‌‌లో జరిగే టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వరకు పూర్తిగా కోలుకుంటాడా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

‘చీలమండ సర్జరీ విజయవంతంగా ముగిసింది. కోలుకోవడానికి కాస్త టైమ్‌‌‌‌ పడుతుంది. అయినప్పటికీ గ్రౌండ్‌‌‌‌లోకి రావడానికి ఎదురుచూస్తున్నా’ అని షమీ ఎక్స్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌ చేశాడు. గతేడాది వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్‌‌‌‌ ఆడిన షమీ అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు.