చెలరేగిన సిరాజ్, అర్షదీప్..160 పరుగులకే కివీస్ ఆలౌట్

 చెలరేగిన సిరాజ్, అర్షదీప్..160 పరుగులకే కివీస్ ఆలౌట్

మూడో టీ20లో టీమిండియాకు161 పరుగుల టార్గెట్ను న్యూజిలాండ్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్..19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆ జట్టు  9 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఫిన్ అలెన్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మార్క్ చాప్ మాన్ 12 రన్స్ చేసి పెవీలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కాన్వె, గ్లెన్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నారు. హఫ్ సెంచరీతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. మూడో వికెట్ కు 86 పరుగులు జోడించారు. 

టపటపా..
130 పరుగుల వద్ద ఫిలిప్స్ ఔటవడంతో...న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఆ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. మరో 16 పరుగుల వ్యవధిలో కాన్వె పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత నీషమ్, సాంట్నర్, మిచెల్ సోదీ, మిల్నే, సౌథీ స్వల్ప పరుగుల వద్ద ఔటవడంతో...చివరకు న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో సిరాజ్ , అర్షదీప్ సింగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.