వైస్ కెప్టెన్ గా జడేజా.. వెస్టిండీస్ సిరీస్ కు భారత జట్టు ఇదే

 వైస్ కెప్టెన్ గా జడేజా.. వెస్టిండీస్ సిరీస్ కు భారత జట్టు ఇదే

స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టును ప్రకటించి బీసీసీఐ.  మొత్తం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ .శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా  జడేజాను వైస్ కెప్టెన్ గా  వ్యవహరించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 6 మధ్య మొదటి టెస్టు .. అక్టోబర్ 10 నుంచి14 మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. 

గాయం కారణంగా దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్లేసులో ఫస్ట్ చాయిస్ గా ధృవ్ జురెల్ ను తీసుకోగా..బ్యాకప్ వికెట్ కీపర్ గా తమిళనాడుకు చెందిన ఎన్. జగదీశన్ ను ఎంపిక చేశారు. 

ఇక ఇంగ్లాండ్ పర్యటన  తర్వాత సాయి సుదర్శన్ , దేవదత్ పడిక్కల్ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కానీ  ట్రిపుల్ సెంచరీ వీరుడు  కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ సిరీస్ లో ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కరుణ్ నాయర్ ను పక్కన పెట్టింది బీసీసీఐ.  అలాగే  ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ కు కూడా జట్టులో స్థానం దక్కలేదు.

టీమిండియా జట్టు 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్ ), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్.జగదీషన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కులదీప్ యాదవ్