ఫిబ్రవరిలో డైమండ్ డెకాయిట్ మూవీ విడుదల

ఫిబ్రవరిలో డైమండ్ డెకాయిట్ మూవీ విడుదల

పార్ధ గోపాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్‌‌’. మేఘన హీరోయిన్. సూర్య జి యాదవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌‌‌‌ లాంచ్‌‌ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌‌లో జరిగింది. పార్ధ గోపాల్ మాట్లాడుతూ ‘ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్‌‌ రివెంజ్ డ్రామా. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘కడప జిల్లాలోని అరవైకి పైగా లొకేషన్స్‌‌లో చిత్రీకరించాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో పాటు రివేంజ్ డ్రామా ఆకట్టుకుంటుంది. పెద్దపల్లి రోహిత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.  ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’ అని చెప్పాడు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ మేఘన,  మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ పాల్గొన్నారు.