
భారతదేశంలో దీపావళిని ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటుంటారు. హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఈ పండుగకు బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను బహుమతులుగా ఇచ్చుకోవటం సాంప్రదాయంగా చాలా ఏళ్లుగా వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ మెల్లగా మారిపోతోంది. కొన్నేళ్లుగా ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఇలా తమ ప్రియమైన వారికి ఆర్థిక భద్రతను కలిగించే అనేక ఉత్పత్తులను గిఫ్ట్ గా ఇవ్వటం చూస్తూనే ఉన్నాం.
కానీ ఈసారి టెక్ సావీ ఇండియన్స్ మరో అడుగు ముందుకేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అదే క్రిప్టో కరెన్సీలను తమ ప్రియమైన వారికి బహుకరించటం. ప్రస్తుతం ట్రంప్ వచ్చిన తర్వాతి నుంచి వీటికి తిరుగులేని ర్యాలీ ఉంది. అందుకే కొందరు సంపన్న వర్గాలు దీపావళికి బిట్ కాయిన్స్ గిఫ్టింగ్ చేస్తున్నారు. మారుతున్న పెట్టుబడి ధోరణుల సమయంలో దీనిని కొందరు డిజిటల్ బంగారం మాదిరిగా భావిస్తున్నారు. అందుకే బంగారానికి బదులుగా బిట్ కాయిన్స్ మిలీనియల్స్, జెన్ జెడ్ యువత క్రిప్టోలను భావిస్తున్నట్లు వెల్లడైంది.
మారుతున్న ప్రజల ఆశలు, ఆశయాలు, అభిరుచులకు అనుగుణంగా కొన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీ ఫ్లాట్ ఫారమ్ సంస్థలు దీపావళికి ప్రత్యేక ఫీచర్లను పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో వారు బిట్ కాయిన్ గిఫ్ట్ కార్డ్స్, ట్రేడింగ్ ఛార్జీల మాఫీ వంటివి తీసుకొస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి సంపన్న వ్యాపార వర్గాల వరకు అందరూ తమ ప్రైవేట్ వెల్త్ మేనేజర్ల సూచన మేరకు చాలా కాలం నుంచి క్రిప్టో సాధనాల్లో డబ్బు ఇన్వెస్ట్ చేయటం.. వాటిని తమ కుటుంబాలు, స్నేహితులకు గిఫ్ట్ రూపంలో అందించటం చేస్తున్నారు.