
గచ్చిబౌలి, వెలుగు: సొంతూరుకు వెళ్తుండగా అస్వస్థతకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం పట్టణం గాంధీనగర్ కు చెందిన చింతల యామిని(27) గచ్చిబౌలి ఇందిరానగర్ లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. మంగళవారం సొంతూరు వెళ్లేందుకు ఉదయమే కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
స్టేషన్ వద్ద ఆమెకు వాంతులు అవ్వడంతో తిరిగి హాస్టల్ కు వెళ్లింది. చున్నీతో గ్రిల్‌కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.