
బెంగళూరు: భారత్, పాక్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో పాక్ అనుకూలంగా నినాదాలు చేసిన బెంగళూరు టెకీని పోలీసులు అరెస్ట్ చేశారు. గతవారం పేయింగ్ గెస్ట్ (పిజి) వసతి గృహం వెలుపల పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశాడనే ఆరోపణలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి శుభాన్షు శుక్లా(25)ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు శుభాన్షు శుక్లా ఛత్తీస్‌గఢ్‌కు చెందివాడుగా గుర్తించారు. శుక్లా సౌత్ ఈస్ట్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలు ఏడాది కాలంగా పనిచేస్తున్నాడు. శుక్లాను మొదట మే 9న జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సోమవారం మళ్లీ విచారణ కోసం పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత శుక్లాను తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తాజాగా అరెస్ట్ చేశారు.
మే9 తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత్ , పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో మే 11న శుక్లా పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశాడు. బెంగళూరులోని ప్రశాంత్ లే అవుట్ లోని తన పీజీ హాస్టల్ లో బాల్కనీలో నిల్చొని పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ALSO READ | కర్నల్ సోఫియాపై కామెంట్లు.. మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు
శుక్లా నినాదాలు చేస్తుండగా.. వీడియో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విచారణలో శుక్లా పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. వీడియోలో కూడా నినాదాలు చేసింది శుక్లానే అని కనిపిస్తుంది.
అయితే నినాదాలు చేసింది శుక్లానా కాదా అనేది నిర్ధారించేందుకు వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శుక్లా నుండి వాయిస్ శాంపిల్ కూడా సేకరించి నిర్ధారణకోసం FSL కి పంపామన్నారు. సంఘటన జరిగిన సమయంలో శుక్లా మద్యం సేవించి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు వైద్య పరీక్ష కోసం బ్లడ్ శాంపిల్స్ పంపామని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తెలిపారు.