జనగామ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనగణన -2026 కోసం జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన 16 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 1 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు వారం రోజుల కింద జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఈ సందర్భంగా 243 మంది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా, మెరిట్ ఆధారంగా తీసుకున్న 84 మంది అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్లో స్కిల్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని పారదర్శకంగా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 52 మంది దరఖాస్తు చేసుకోగా, 1:6 రేషియోలో మెరిట్ ఆధారంగా తీసుకుని 6 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఒకరిని ఎంపిక చేస్తామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా ఉపాధి అధికారి రవికాంత్, సీపీవో చిన కోట్యా నాయక్, సూపరింటెండెంట్ ఫణి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
