
- శంషాబాద్ టు తిరుపతి ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్
శంషాబాద్, వెలుగు: విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. మంగళవారం ఉదయం 9ఐ877 అల్లీయన్స్ సంస్థకు చెందిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 53 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది.
టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించాడు. వెంటనే అత్యవసరంగా తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపం పరిష్కారం కాకపోవడంతో ఎయిర్‌లైన్స్ అధికారులు విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులకు రీఫండ్ చేశారు.